విజయ్‌బాబుకు ఘన నివాళి | - | Sakshi
Sakshi News home page

విజయ్‌బాబుకు ఘన నివాళి

Sep 19 2026 4:14 AM | Updated on Sep 19 2026 4:14 AM

కోటవురట్ల: తంగేడు రాజుల ఇంట విషాదం చోటుచేసుకుంది. డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఆర్‌. ఎస్‌.రామచంద్రరాజు తనయుడు, వైఎస్సార్‌ సీపీ యువ నాయకుడు ఆర్‌.ఎస్‌.విజయ్‌బాబు బ్రైన్‌ స్ట్రోక్‌తో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. పిన్న వయస్సులోనే ఆయన మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి స్థాయి రాజకీయ రంగ ప్రవేశంతో ప్రజా సేవ చేయాలన్న ఆయన ఆశయం నెరవేరకముందే ఇలా జరగడంతో అంతా ఆవేదన చెందారు. మృతదేహాన్ని హైదరాబాద్‌ నుంచి స్వగ్రామమైన కోటవుటర్ల మండలం తంగేడుకు శుక్రవారం తీసుకొచ్చారు. మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ కాకినాడ పార్లమెంట్‌ పరిశీలకుడు డి.వి.సూర్యనారాయణరాజు దగ్గర ఉండి కార్య క్రమాన్ని జరిపించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాఽథ్‌, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కంబాల జోగులు, పెట్ల ఉమాశంకర గణేష్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు దిలీప్‌కుమార్‌, మండల అధ్యక్షుడు పైల రమేష్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, వివిధ పార్టీల నాయకులు, అభిమానులు భౌతికకాయం వద్ద ఘనంగా నివాళులర్పించి, కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement