మాకవరపాలెం: పిడుగు పడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. మండలంలోని జి.గంగ వరం శివారు చంద్రయ్యపాలెం గ్రామానికి చెందిన బాలం గంగరాజు(66) ఎప్పటిలాగే శుక్రవారం సాయంత్రం ప్రాథమిక పాఠశాల సమీపంలో గేదెలను మేపుతుండ గా వర్షం కురిసింది. ఈ సమయంలో పిడుగు పడడంతో గంగరాజు మృతి చెందాడు. ఈ ఘటనలో ఆయనతోపాటు ఓ గేదె మరణించింది. విషయం తెలుసుకున్న స్థానికులు గంగరాజును ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.


