గొలుగొండ: మండలంలోని పాకలపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భారీ కాంస్య విగ్రహాన్ని వైఎస్సార్‌సీపీ రీజనల్ కో– ఆర్డినేటర్, కురసాల కన్నబాబు, మాజీ మంత్రి అమర్‌నాథ్, నర్సీపట్నం, చోడవరం మాజీ ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్ గణేష్, కరణం ధర్మశ్రీ, పార్టీ జల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, ఈర్లె అనురాధ, తదితరులు ఆవిష్కరించారు. నర్సీపట్నం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం పాకలపాడులో జరిగింది. ఈ సందర్భంగా పాకలపాడు గ్రామ నాయకులు ఇక్కడ భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు యాళ్ల నాయుడు, రాజాన అప్పలనాయుడు, గోవింద్, గంగరాజు, గంగాధర్, పెదబాబులు, మాణిక్యం, అప్పలనాయడు, కన్నంనాయుడు పాల్గొన్నారు.


