కాలుష్య నియంత్రణ మండలికి నివేదిస్తాం | - | Sakshi
Sakshi News home page

కాలుష్య నియంత్రణ మండలికి నివేదిస్తాం

Sep 19 2026 4:14 AM | Updated on Sep 19 2026 4:14 AM

రావికమతం: రాళ్ల తరలింపు మైనింగ్‌ శాఖ అధికారులు చూసుకుంటారని, వ్యర్థాలు, కాలుష్య అంశాలపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు నివేదిక పంపుతామని నర్సీపట్నం అసిస్టెంట్‌ జియాలజిస్టు జి. మురళీకృష్ణతెలిపారు. మండలంలో కొమిర రెవెన్యూ పరిధి పంట భూముల్లో గ్రానైట్‌ వ్యర్థాలు, ఇసుక మేటలు తొలగించాలని గిరిజన రైతులు అర్ధనగ్న ప్రదర్శన చేసిన విషయం విదితమే. దీనిపై శుక్రవారం పలు పత్రికల్లో వార్తలు రావడంతో ఇక్కడ క్వారీ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గిరిజన రైతులు, సీపీఎం నాయకుడు కే గోవిందరావు మాట్లాడుతూ వి.మాడుగుల మండలం ఊరలోవ రెవెన్యూ పరిధిలో సీతారాం గ్రానైట్‌, గేలాక్సి, జి.కొండపల్లి గ్రానైట్‌క్వారీల నిర్వహణ వల్ల వమ్మలి జగన్నాథపురం గ్రామానికి సీనరేజ్‌ వస్తుందని, రావికమతం మండలంలో కవ్వుగుంట, కొమిర, బుడ్డిబంద గ్రామాల గిరిజన రైతులు మాత్రం నష్టపోతున్నారని వాపోయారు. జీడి తోటల్లో పనులు చేయాలంటే ఏ రాయి వచ్చి పడుతుందోనని భయం వేస్తుందన్నారు. ఈ సమస్య పరిష్కారం కాకపోతే తోటల్లోనే నిరహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం కార్యవర్గ సభ్యురాలు కే భవాని, గిరిజన సంఘం నాయకులు సోలాం రాజిబాబు, చెప్పాడ అప్పారావు, తోకల నూకాలమ్మ, తుర్రె నరసింహమూర్తి, రైతు సంఘం నాయకుడు మల్లు దేవుళ్లు, గిరిజన రైతులు పాల్గొన్నారు.

నర్సీపట్నం అసిస్టెంట్‌ జియాలజిస్టు మురళీకృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement