స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యం

Sep 19 2026 4:14 AM | Updated on Sep 19 2026 4:14 AM

ఎస్‌.రాయవరం: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు అన్నారు. జె.వి. పాలెం, వేమగిరి, సైతారుపేటల్లో గ్రామ కమిటీల సభ్యులకు శుక్రవారం ఆయన ఐడీ కార్డు లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ చాలా బలంగా ఉందన్నారు. స్థానిక ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉందని చెప్పారు. కూటమి నాయకులు ఎన్నికల్లో తప్పుడు హామీలిచ్చి గద్దెనెక్కారని, ఇప్పుడు వాటిని గాలికి వదిలేశారని చెప్పారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారని చెప్పారు. రెండేళ్లుగా ఒక్కొక్కరూ ఏడాదికి రూ.48 వేల నుంచి రూ.72 వేల వరకు నష్టపోయారన్నారు. కూటమి పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఎంత తొందరగా సాగనంపుదామని ఎదురు చూస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు తాము నిత్యం అండగా, అందుబాటులో ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎస్‌.ఎ.ఎన్‌. మధువర్మ, వైస్‌ ఎంపీపీ చోడిపల్లి అప్పన్న, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ యూత్‌ అధ్యక్షుడు పోచిన నరేష్‌, ఎంపీటీసీ సభ్యుడు శానాపతి రాము, వైఎస్సార్‌ సీపీ నాయకులు కట్టుమూరి చంద్రరావు, లక్కోజు ఆదిమూర్తి, కర్రి కోటేశ్వరరావు, గట్టెం పర్వతాలు, శానాపతి శ్రీరాములు, కర్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సమన్వయకర్త కంబాల జోగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement