తుమ్మపాల: అనకాపల్లి మండలం మార్టూరు జెడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం చాలా నాసిరకంగా ఉందని, పిల్లలు తినలేకపోతున్నారని ఆరోపి స్తూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్ద శుక్రవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన మెనూ ను ఇక్కడ అమలు చేయడం లేదని తెలిపారు. ఇటీవల పాఠశాలలో భోజనం చేసిన ఓ విద్యార్థినికి తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు రావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్టు చెప్పారు. వైద్యులు ఫుడ్ పాయిజన్ అయినట్టు నిర్ధారించారని తెలిపారు. తరచూ ఈ సమస్య పునరావృతమవుతున్నా సంబంధిత సిబ్బంది, అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పలుమార్లు పాఠశాల సిబ్బందికి, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని తల్లిదండ్రులు వాపోయారు.
మార్టూరు జెడ్పీ హైస్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన


