ముంచంగిపుట్టు: అనకాపల్లిలో ఈ నెల 23 వరకు 13వ డివిజన్ స్థాయి డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు అరకు పోస్టల్ ఐపీవో వి.లక్ష్మీకిషోర్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రజ ల నుంచి పోస్టల్ సేవలకు సంబంధించిన నిర్దిష్టమైన వ్యక్తిగత ఫిర్యాదులు, అభ్యంతరాలను ఈ డాక్ అదాలత్‌లో విచారించి పరిష్కరిస్తామన్నా రు. ఈ నెల 21వ తేదీలోపు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన బాధితులు తమ ఫిర్యాదులను పంపాలని కోరారు. ఫిర్యాదు లేఖలు లేదా కవర్లపై ఖచ్చితంగా ’13వ డాక్ అదాలత్’ అని స్పష్టంగా రాయాలని సూచించారు. ఫిర్యాదులు డీవీఎన్ ప్రతాప్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, సూపరింటెండెంట్ పోస్ట్ ఆఫీస్, అనకాపల్లి – 531001కు పంపాలన్నారు. ఈ నెల 23వ తేదీ బుధవారం ఉదయం 11:30 గంటలకు అనకాపల్లి డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అరకు, డుంబ్రిగుడ, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల పోస్టల్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


