10 వేల మట్టి వినాయక విగ్రహాల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

10 వేల మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

Sep 7 2026 12:39 AM | Updated on Sep 7 2026 12:39 AM

చోడవరం: పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు అన్నారు. వినాయక చవితిని పురష్కరించుకొని చోడవరం మాజీ సర్పంచ్‌ సకురు పెంటారావు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మట్టి వినాయకుడి విగ్రహాలు పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. మట్టి వినాయకుడి విగ్రహాలతో పాటు వినాయక వ్రతకల్పం పుస్తకాన్ని కూడా భక్తులకు అందజేశారు. సుమారు 10వేల మట్టి విగ్రహాలను ఉచితంగా భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుందని నిర్వాహకుడు సకురు కోటేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, ఇతర వ్యర్థాలతో కూడిన ముడిసరుకుతో విగ్రహాలతో తయారు చేయడం వల్ల పర్యావరణానికి చాలా విఘాతం కలుగుతుందన్నారు. మట్టి విగ్రహాలు నెలక్పొడం వల్ల విగ్రహాలు అనుపు చేసినపుడు తొందరగా మట్టిలో కలిసిపోయి, పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తామర చెరువు, సకురు వీధి ప్రాంతాల యువకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement