మాకవరపాలెం: రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీలకు 36 మంది ఎంపికయ్యారని బేస్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ అక్షజ్‌కృష్ణ తెలిపారు. స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించారు. వీటిలో వివిధ మండలాల నుంచి సీనియర్ విభాగంలో బాలికలు, బాలురు 120 మంది హాజరయ్యారు. వీరికి నిర్వహించిన ఎంపికల్లో 18 మంది బాలురు, 18 మంది బాలికలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరంతా ఈ నెల 12 నుంచి 14 వరకు అనంతపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు రవి, నూకరాజు పాల్గొన్నారు.


