భార్యను హతమార్చిన భర్త అరెస్టు | - | Sakshi
Sakshi News home page

భార్యను హతమార్చిన భర్త అరెస్టు

Aug 18 2026 12:27 AM | Updated on Aug 18 2026 12:27 AM

డుంబ్రిగుడ: మండలంలోని కొర్ర పంచాయతీ శెట్టిబంద గ్రామంలో శనివారం రాత్రి మద్యం మత్తులో భార్యను హత్య చేసిన గెమ్మెలి కామయ్యను సోమ వారం అరెస్టు చేసినట్టు అరకులోయ సీఐ కోటేశ్వరరా వు, ఎస్‌ఐ ఎల్‌.సురేష్‌ తెలిపారు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని భార్య గెమ్మెలి కోమలితో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య వివాదం తారస్థాయికి చేరింది. దీంతో విచక్షణ కోల్పోయి భార్య మెడ, శరీరంపై కర్రతో బలంగా కొట్టడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు కామయ్య ను అరెస్టు చేసి, వైద్య పరీక్షలు నిర్వహించి, న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement