వీరుల త్యాగాలు మరువలేనివి | - | Sakshi
Sakshi News home page

వీరుల త్యాగాలు మరువలేనివి

Aug 16 2026 4:45 AM | Updated on Aug 16 2026 4:45 AM

పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు

పాడేరు : దేశ స్వాతంత్య్రంలో వీరుల త్యాగాలు ఎన్నటికి మరువలేనివని సమాజంలో ప్రతి పౌరుడు వారి అడుగుజాడల్లో నడిచి నవభారత నిర్మాణంలో కీలకపాత్ర పోషించాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అద్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు పిలుపునిచ్చారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ గీతాన్ని ఆలపించి జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెడబారికి సురేష్‌కుమార్‌, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్‌కుమార్‌, ఐటీ విబాగం జిల్లా అద్యక్షుడు కూడా సుబ్రమణ్యం, వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యానారాయణ, మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు ఊర్వశిరాణి, మాజీ సర్పంచ్‌లు పాంగి నాగరాజు, మినుముల కన్నాపాత్రుడు, మాజీ పీఏసీఎస్‌ అద్యక్షురాలు రామసత్యవతి, పార్టీ నాయకులు బూర మహేష్‌, దుడ్డు లక్ష్మోజి, కిల్లు శంకర్‌, మోదమాంబ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement