డుంబ్రిగుడలో టీడీపీకి బిగ్‌ షాక్‌ | - | Sakshi
Sakshi News home page

డుంబ్రిగుడలో టీడీపీకి బిగ్‌ షాక్‌

Aug 21 2026 2:39 AM | Updated on Aug 21 2026 2:39 AM

అరకులోయ టౌన్‌: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన నచ్చకే ఇతర పార్టీల శ్రేణులు వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నారని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. డుంబ్రిగుడ మండల పార్టీ అధ్యక్షుడు పాంగి పరశురామ్‌ ఆధ్వర్యంలో గురువారం కొర్రాయి పంచాయతీ పరిధిలోని జాముగుడ, జాంకరవలస, అంజోడ, బోందుగుడ గ్రామాలకు చెందిన సుమారు 100 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరాయి. పార్టీలోకి వచ్చిన వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ.. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అందించిన సంక్షేమ పథకాలను, ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిఒక్కరికీ వివరించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల కష్టంతో రాబోయే స్థానిక సంస్థల, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కొర్రాయి పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు లైచోన్‌ ఆధ్వర్యంలో నాలుగు గ్రామాల నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరడం అభినందనీయమని మండల పార్టీ అధ్యక్షుడు పాంగి పరశురామ్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, మాజీ ఎంపీపీ శెట్టి నీలవేణి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు పల్లాసింగ్‌ విజయ్‌ కుమార్‌, జిల్లా సంయుక్త కార్యదర్శి నర్సింగరావు, నియోజకవర్గం బూత్‌ కమిటీ ఇన్‌చార్జ్‌ పాంగి విజయ్‌, మాజీ వైస్‌ ఎంపీపీ ధర్మనాయుడు, మండల ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు బీబీ కామేశ్వరరావు, సందడి కొండబాబు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలో చేరినవంద కుటుంబాలు

పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

పాలన నచ్చకే చేరినట్టు వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement