● పట్టించుకోని దివ్యాంగుల సంక్షేమ శాఖ
సాక్షి,పాడేరు: జిల్లాలోని దివ్యాంగులకు పంపిణీ చేయాల్సిన మూడు చక్రాల స్కూటీలు పాడేరు జూనియర్ కళాశాల ఆవరణలో తుప్పుపడుతున్నాయి. రెండు నెలలుగా 20 స్కూటీలు వానకు తడుస్తూ, ఎండకు ఎండుతుండడంతో పాడవుతున్నాయి. కొన్ని భాగాలకు తుప్పు పట్టడంతో దివ్యాంగులకు పంపిణీ చేయకుండానే పాడయ్యే పరిస్థితి నెలకొంది.సురక్షిత ప్రాంతాల్లో స్కూటీలను భద్రపరచాల్సిన దివ్యాంగుల సంక్షేమశాఖ అధికారులు కళాశాల ఆవరణలో ఆరు బయట ఉంచడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు తెలిపారు. లబ్ధిదారులకు వీటిని పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


