ఎస్.రాయవరం: అడ్డురోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై ఆటోకి తగిలి గాయపడిన వ్యక్తి మృతి చెందినట్టు ఏఎస్‌ఐ వెంకటేశ్వరావు బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి కోనవానిపాలెం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కోన రాజు(38) మంగళవారం అడ్డురోడ్డు సమీపంలో ముందు వెళుతున్న వాహనాన్ని తప్పించబోయి సడన్‌బ్రేక్ వేయడంతో తన ఆటోకి ముందు భాగం తలకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు డ్రైవర్ రాజుని నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి ఆపై కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బుధవారం కాకినాడలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు చెప్పారు. వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ చెప్పారు.


