గిరిజనాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

గిరిజనాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

Aug 13 2026 12:27 AM | Updated on Aug 13 2026 12:27 AM

కొమ్మాది: గిరిజన విద్య, సంస్కృతి, ఉత్పత్తుల అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ ఆర్‌.బాలసుబ్రహ్మణ్యం సూచించారు. రుషికొండలోని గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణా మిషన్‌ (టీసీఆర్‌టీఎం) కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. సంస్థ చేపడుతున్న అభివృద్ధి, పరిశోధనా కార్యక్రమాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యకలాపాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గిరిజన భాషల ప్రైమర్లు, చిత్రకోశాలను ఆశ్రమ పాఠశాలల లైబ్రరీల్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఉపాధ్యాయులకు గిరిజన సంస్కృతిపై శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఏఎస్‌ఆర్‌ జిల్లాలో గిరిజన ఉత్పత్తుల బ్రాండింగ్‌, విలువ పెంపు కోసం ఐఐఎం విశాఖపట్నంతో కలిసి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ సమిధా సింగ్‌, టీసీఆర్‌టీఎం డైరెక్టర్‌ రాణి మందా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement