ఏటీఎం మోసగాడు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఏటీఎం మోసగాడు అరెస్ట్‌

Aug 13 2026 12:27 AM | Updated on Aug 13 2026 12:27 AM

అనకాపల్లి టౌన్‌: ఏటీఎంలో సహాయం చేస్తానంటూ వృద్ధుడిని నమ్మించి ఏటీఎం కార్డు, పిన్‌ విరాలు సేకరించి రూ.10 వేలు కాజేసిన అంతర్‌ జిల్లా నిందితుడిని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. పట్టణ క్రైం ఎస్‌ఐ అల్లు వెంకటేశ్వరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 4న మెయిన్‌రోడ్‌ మాణిక్య లాడ్జి కింద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో 76 ఏళ్ల ఆకెళ్ల సూర్యనారాయణమూర్తి లావాదేవీ నిర్వహిస్తుండగా నిందితుడు ప్రత్తి రాజేష్‌ సహాయం చేస్తానని నమ్మించి, ఆయన ఏటీఎం, పిన్‌ వివరాలను తెలుసుకొని బాధితుడికి తెలియకుండా ఖాతా నుంచి రూ.10 వేలు విత్‌డ్రా చేసి పరారయ్యాడు. ఈ మేరకు బాఽధితుడు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించి, గూడ్స్‌ రోడ్‌ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఈ నిందితుడిపై ఉమ్మడి విశాఖ, కాకినాడ జిల్లాలలో 12 దొంగతనం, చీటింగ్‌ కేసులు ఉన్నాయని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement