‘పాత పెన్షన్‌’ కోసం 1న చలో విజయవాడ | - | Sakshi
Sakshi News home page

‘పాత పెన్షన్‌’ కోసం 1న చలో విజయవాడ

Aug 12 2026 1:22 AM | Updated on Aug 12 2026 1:22 AM

అనకాపల్లి: ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ వచ్చేనెల 1న నిర్వహించనున్న ‘చలో విజయవాడ’కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ సీపీఎస్‌ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సతీష్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఏపీఎన్‌జీవోస్‌ కార్యాలయంలో వాల్‌పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత పెన్షన్‌ విధానం అమలు అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వై.శ్రీనివాస్‌, యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయ్‌, ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ బోయిన చిన్నారావు, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు జి.కృష్ణ, ఏపీపీటీఏ జిల్లా అధ్యక్షుడు చల్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement