లైంగిక దాడి కేసులో బాలిక తల్లి, సచివాలయ ఉద్యోగి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

లైంగిక దాడి కేసులో బాలిక తల్లి, సచివాలయ ఉద్యోగి అరెస్టు

Aug 12 2026 1:22 AM | Updated on Aug 12 2026 1:22 AM

పోక్సో చట్టం కింద కేసు నమోదు

నిందితులకు రిమాండ్‌

అనకాపల్లి టౌన్‌: పట్టణ ప్రాంతానికి చెందిన ఓ బాలికపై లైంగిక దాడి కేసులో బాలిక తల్లితో పాటు సచివాలయ ఉద్యోగిని అరెస్ట్‌ చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ జి. ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన అందించిన వివరాలివి. పట్టణంలోని ఓ బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకొని ఒక ప్రైవేట్‌ హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నట్టు అందిన సమాచారం మేరకు విచారణ జరపగా లైంగిక దాడి విషయం వెలుగు చూసిందన్నారు. కుటుంబ కలహాల కారణంగా భర్తతో విడిపోయిన ఒక మహిళకు శారదానగర్‌కు చెందిన ఓ సచివాలయ ఉద్యోగితో పరిచయం ఏర్పడిందన్నారు. సదరు ఉద్యోగి కూడా తన భార్యకు దూరంగా ఉంటూ బాలిక తల్లితో సహజీవనం చేస్తున్నాడని తెలిపారు. ఈ క్రమంలో డబ్బు ఆశతో బాలిక తల్లి బాలికను కూడా సచివాలయ ఉద్యోగితో బలవంతంగా లైంగిక దాడి జరిపించినట్టు దర్యాప్తు తేలిందన్నారు. ఈ మేరకు బాలిక తల్లితో పాటు సచివాలయ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని నాయస్థానం ఎదుట హాజరు పరచగా రిమాండ్‌ విధించినట్టు తెలిపారు. ప్రస్తుతం బాధిత బాలికను వన్‌స్టాప్‌ సెంటర్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement