పలు కేసుల్లో మాజీ ఎమ్మెల్యే గణేష్‌కు ఊరట | - | Sakshi
Sakshi News home page

పలు కేసుల్లో మాజీ ఎమ్మెల్యే గణేష్‌కు ఊరట

Aug 12 2026 1:22 AM | Updated on Aug 12 2026 1:22 AM

నర్సీపట్నం: పలు కేసుల్లో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌, పార్టీ నాయకులకు ఊరట లభించింది. విశాఖ ఎయిర్‌పోర్టులో మాజీ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన కోడి కత్తితో హత్యాయత్నం ఘటనపై ఆందోళన చేయడంపై 2018లో మాజీ ఎమ్మెల్యే గణేష్‌, మరికొంత మందిపై నర్సీపట్నం టౌన్‌ పోలీసు అక్రమ కేసు పెట్టారు. అదే సంవత్సరంలో ఓటరు లిస్ట్‌లో ఓటర్లను తొలగించడంపై ఆర్డీవోకు ఫిర్యాదు చేస్తే అక్రమ కేసు బనాయించారు. తన వాదనలు విన్న కోర్టు ఈ రెండు కేసులను కొట్టేస్తూ తీర్పు ఇవ్వడం జరిగిందని లాయర్‌ మాకిరెడ్డి బుల్లిదొర తెలిపారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏకా శివ, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, పట్టణ యూత్‌ అధ్యక్షుడు అల్లంపల్లి ఈశ్వరరావు, సీనియర్‌ నాయకులు ఏకా రాజుబాబుకు ఊరట లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement