ముంచంగిపుట్టు: ఉపాధ్యాయుల సంక్షేమమే లక్ష్యంగా యూటీఎఫ్ పనిచేస్తోందని యూటీఎఫ్ జిల్లా కోశాధికారి మొశ్యా ధర్మారావు అన్నారు. మండల కేంద్రం ముంచంగిపుట్టులో సోమవారం 53వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యూటీఎఫ్ జెండాను మండల గౌరవ అధ్యక్షుడు చిన్నయ్య ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ధర్మారావు మాట్లాడుతూ 53ఏళ్ల యూటీఎఫ్ ఉద్యమ ప్రస్థానంలో అనేక పోరాటాలు చేసి ఉపాధ్యాయులకు అండగా నిలిచినట్టు చెప్పారు. అమరజీవి చెన్నుపాటి ఆశయాల సాధన బాటలో పయనిస్తూ రాష్ట్రంలో అతిపెద్ద సంఘంగా ఏర్పడిందని తెలిపారు. సీపీఎస్ రద్దుకు యూటీఎఫ్ నిరంతరం పోరాడుతూనే ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మండల అధ్యక్ష,కార్యదర్శులు రాజు, గోపి, సహాధ్యక్షురాలు ముక్తమ్మ, యూటీఎఫ్ సీనియర్ నాయకులు సూర్యనారాయణ, గోవింద్,మోహన్, సిద్ధేశ్వరరావు, ధనుపతి,రఘుమణి, మత్స్యలింగం,లీలావతి తదితరులు పాల్గొన్నారు.


