విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందిస్తున్న జేసీ శౌర్యమాన్ పటేల్
తుమ్మపాల: దివ్యాంగులమని వెనుకంజ వేయకుండా అద్భుత ప్రతిభ కనబరిచిన జిల్లా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ది డెఫ్ జట్టు ఫైనల్ పోటీలో విజయం సాధించి చాంపియనషిప్ ట్రోఫీని కై వసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని జేసీ శౌర్యమాన్ పటేల్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో క్రీడాకారులకు ఆయన మెడల్స్, ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 1, 2 తేదీల్లో విశాఖలోని నిర్వహించిన 4వ జోనల్–1 డెఫ్ టీ–20 క్రికెట్ చాంపియషిప్–2026 పోటీల్లో అనకాపల్లి జిల్లా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ది డెఫ్ జట్టు విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల జట్లు పాల్గొన్నాయి. జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చిన డెఫ్ క్రికెట్ జట్టు సభ్యులను అధికారులు అభినందించారు.


