ఎస్.రాయవరం : మండలంలో పలు గ్రామాల్లో విద్యుత్ మోటార్ల చోరీ కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్టు నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. అడ్డురోడ్డు సర్కిల్ కార్యాలయంలో సోమవారం డీఎస్పీ స్థానిక విలేకర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్.రాయవరం మండలంలో పలు గ్రామాల్లో వ్యవసాయ మోటర్లు, వాటి వైర్లు చోరీ గురి కావడంతో రైతుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసుల్లో ఎస్.రాయవరం గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులను పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామన్నారు. ఈ సమావేశంలో సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ రమేష్ ఉన్నారు.


