ఎంపికై న విద్యార్థులతో ఉపాధ్యాయులు
మాకవరపాలెం : జిల్లాస్థాయి ఆటల పోటీల్లో స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మూడు రోజులుగా అనకాపల్లిలో జిల్లాస్థాయిలో అమరావతి ఛాంపియన్ షిప్ పోటీలు జరుగుతున్నాయి. స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొన్నారు. అండర్–17 కబడ్డీ పోటీల్లో కె.సింధుజ, కె.ఇందు, వి.పూజిత, అండర్–17 వాలీబాల్ పోటీల్లో ఎస్.తులసీరాజ్, అండర్–17 చెస్ పోటీల్లో వి.చరణ్ జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల హెచ్‌ఎం వి.శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. వీరిని పీఈటీలు, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.


