ఎంపీ రమేష్‌ గనుల దోపిడీపై ఢిల్లీలో తేల్చుకుంటాం | - | Sakshi
Sakshi News home page

ఎంపీ రమేష్‌ గనుల దోపిడీపై ఢిల్లీలో తేల్చుకుంటాం

Aug 11 2026 1:06 AM | Updated on Aug 11 2026 1:06 AM

● మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాఽథ్‌

● మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాఽథ్‌

జిల్లాలో మైనింగ్‌

చోడవరం : జిల్లాలో మైనింగ్‌ మాఫియా నడిపిస్తూ గనులను దోచేస్తున్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ సంగతి ఢిల్లీలో తేలుస్తామని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఉభయగోదావరి జిల్లాల కో ఆర్డినేటర్‌ గుడివాడ అమర్‌నాఽథ్‌ అన్నారు. చోడవరంలో వైఎస్సార్‌సీపీ సోమవారం నిర్వహించిన ర్యాలీలో అమర్‌నాఽథ్‌ మాట్లాడుతూ దోచుకోవడానికి సీఎం రమేష్‌ అనకాపల్లి వచ్చారని ఆరోపించారు. పచ్చని పొలాలను ఆనుకొని ఉన్న పచ్చని కొండలను పిండి చేసి మైనింగ్‌ మాఫియా నడిపిస్తూ గనులను దోచుకొని అక్రమ సంపాదన ఆర్జిస్తున్నారని ధ్వజమెత్తారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన పంచదార్ల కొండతో పాటు జిల్లాలో గ్రానైట్‌, నల్లరాయి, మెటల్‌, మట్టి వంటి గనులను అక్రమంగా దోచుకుంటున్నారన్నారు. ఆయన దోపిడీ నుంచి ఈ ప్రాంతాలన్నీ పరిరక్షించేందుకు వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement