13 నుంచి కనకమహాలక్ష్మి ఆలయంలో శ్రావణమాస పూజలు | - | Sakshi
Sakshi News home page

13 నుంచి కనకమహాలక్ష్మి ఆలయంలో శ్రావణమాస పూజలు

Aug 10 2026 1:28 AM | Updated on Aug 10 2026 1:28 AM

● భారీ ఏర్పాట్లు ● వివరాలు వెల్లడించిన ఈవో సుజాత

డాబాగార్డెన్స్‌: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, విశాఖ వాసుల ఆరాధ్యదైవం శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానంలో ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 11 వరకు శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ‘శ్రావణలక్ష్మి ప్రత్యేక కుంకుమ పూజలు’ ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సుజాత తెలిపారు.

నిత్య పూజలు.. సమయాలు

నెల రోజుల పాటు రోజూ ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈ పూజలు జరుగుతాయి. అలాగే విశేష దినాలైన గురు, శుక్రవారాల్లో రెండు విడతలుగా ఉదయం 8 నుంచి 9 వరకు, 9.30 నుంచి 10.30 వరకు ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహిస్తారు. పూజలో భాగంగా సంకల్పం, లక్ష్మీ సహస్రనామార్చన, లక్ష్మీ హోమం, అమ్మవారి దర్శనం మరియు వేదాశీర్వచనం చేపడతారు. భక్తులకు అవసరమైన పూజా సామగ్రిని దేవస్థానమే సమకూర్చనుంది.

టికెట్‌ రుసుము

ఈ సామూహిక కుంకుమ పూజలో పాల్గొనదలచే భక్తులు (దంపతులు) రూ.516 టికెట్‌ రుసుము చెల్లించాలి. పూజ అనంతరం భక్తులకు శేషవస్త్రంగా కండువా, జాకెట్‌ ముక్క, పావు కేజీ పులిహోర, పావు కేజీ చక్కెర పొంగలి, రాగి శ్రీచక్రయంత్రాన్ని మహాప్రసాదంగా అందజేస్తారు.

ముఖ్యమైన పర్వదినాలు

శ్రావణమాసంలో వచ్చే మూడో శుక్రవారం (ఆగస్టు 21) వరలక్ష్మీ వ్రతాన్ని, అలాగే ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలను వైభవంగా నిర్వహించనున్నారు. మాసంలో వచ్చే ఐదు శుక్రవారాల్లో (ఆగస్టు 14, 21, 28, సెప్టెంబర్‌ 4, 11) విశేష కార్యక్రమాలు ఉంటాయి.

13న పూజల ప్రారంభం

ఈ నెల 13న ఉదయం 8.20 గంటలకు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ పూజలను అధికారికంగా ప్రారంభించనున్నారు. భక్తులందరూ విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని ఈవో కోరారు.

పరోక్ష/ఆన్‌లైన్‌ సేవల వివరాలు:

ఆలయానికి నేరుగా రాలేని స్థానికేతర భక్తుల గోత్రనామాలతో పూజ నిర్వహించి, లక్ష్మీ యంత్రం, కుంకుమ, ప్రసాదాన్ని పోస్టల్‌ ద్వారా వారి ఇంటి చిరునామాకు పంపుతారు.

బ్యాంక్‌ ఖాతా వివరాలు: 060810011006691 (ఐఎఫ్‌ఎస్‌సీ : యూబీఐఎన్‌ 0806081), యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, టౌన్‌ కొత్తరోడ్డు బ్రాంచ్‌.

ఫోన్‌ నంబర్లు: 0891–2568645, 2566515, 2731250

వెబ్‌సైట్‌: www.aptemples.org

ఆన్‌లైన్‌ పూజల సమాచారం కోసం ‘మనమిత్ర’ వాట్సాప్‌లో కూడా సంప్రదించాలని ఈవో సుజాత పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement