టైరు పేలి డివైడర్‌ను ఢీకొన్న కారు | - | Sakshi
Sakshi News home page

టైరు పేలి డివైడర్‌ను ఢీకొన్న కారు

Aug 10 2026 1:28 AM | Updated on Aug 10 2026 1:28 AM

ముగ్గురికి గాయాలు

ఎస్‌.రాయవరం: మండలంలోని గోకులపాడు సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. అడ్డురోడ్డు వైపు నుంచి విశాఖపట్నం వెళ్తుతున్న కారు టైరు పేలడంతో డివైడర్‌ను ఢీకొంది. కారులో సేఫ్టీ బెలూన్లు ఓపెన్‌ కావడం, ఆ సమయంలో వెనుక నుంచి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గమనించిన స్థానికులు కారులో చిక్కుకున్న ముగ్గురిని బయటకు తీశారు. ప్రథమ చికిత్స అనంతరం మరో వాహనంలో వారు వెళ్లిపోయారు. ఈ ప్రమాదంపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ ప్రసాదరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement