ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ఒనకఢిల్లీలో ఆదివారం బీఎస్‌ఎఫ్ 103వ బెటాలియన్ ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ నిర్వహించారు. బీఎస్‌ఎఫ్ కమాండెంట్ నీరజ్ చౌదరి ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో బీఎస్‌ఎఫ్ జవాన్లు, విద్యార్థులు, స్థానికులు క్యాంప్ నుంచి పురవీధుల మీదుగా ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో ర్యాలీ మార్మోగింది. ఈ సందర్భంగా కమాండెంట్ నీరజ్ చౌదరి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను గౌరవించాలని, దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.


