డుంబ్రిగుడ: మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన చాపరాయి, అరకు ఫైనరీలో ఆదివారం సందడి నెలకొంది. శనివారం బంద్ కారణంగా పర్యాటక ప్రదేశాలు వెలవెలబోయాయి. ఆదివారం సెలవు కావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చాపరాయిలో పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదించడంతో పాటు గిరిజన సంప్రదాయ వస్త్రాలను ధరించి థింసా నృత్యం చేస్తూ సందడి చేశారు. అరకు ఫైనరీ వద్ద పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆటస్థలంలో చిన్నారులు ఆటలాడుతూ సందడి చేశారు. పర్యాటక ప్రదేశాల్లో గిరిజనులు విక్రయించే బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీకి ప్రత్యేక ఆదరణ లభించింది.


