మోటార్‌తో నీటిని పంట భూములకుమళ్లిస్తున్న దృశ్యం
వరినాట్లు వేస్తున్న గిరిజన మహిళలు
సాక్షి, పాడేరు: ఏజెన్సీలో వర్షపాతం తక్కువగా ఉండటంతో మెట్ట ప్రాంతాల్లో ఖరీఫ్ సాగుకు నీటి సమస్య ఎదురవుతోంది. వర్షాలు కురుస్తున్నా.. సరిపడా నీరు అందక వరినాట్లు ఆలస్యమవుతున్నాయని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడేరుకు సమీపంలోని సేరిబయలు, నక్కలపుట్టు, కిండంగి గ్రామాల్లోని ఖరీఫ్ వ్యవసాయ భూముల్లో వరినాట్లకు నీటి ఇబ్బందులు తలెత్తాయి. ఎకరాలో నారు ముదిరిపోతుండటంతో సేరిబయలు రైతులు మోటార్ సాయంతో చెరువు నుంచి నీటిని పొలాలకు మళ్లించారు. ఆ నీటితో దమ్ము చేపట్టి నాట్లు పూర్తి చేశారు. వర్షాలు జల్లులుగా కురుస్తున్నా సాగునీటికి ఇబ్బదులు పడుతున్నారు.
ఇబ్బందులు పడుతున్న రైతులు


