పాడేరు: పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటీవల వైఎస్సార్‌సీపీలో చేరికలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. నాలుగు రోజుల క్రితం రిటైర్డ్ కాఫీ ఉద్యోగి రూఢీ అప్పారావు వైఎస్సార్‌సీపీలో చేరగా.. తాజాగా శనివారం మరో రిటైర్డ్ ఉద్యోగి పార్టీలో చేరారు. కొయ్యూరు మండలం చిట్టెంపాడు గ్రామానికి చెందిన నేమాని సింహాద్రి ఎల్‌ఐసీలో హైగ్రేడ్ అసిస్టెంట్‌గా ఉద్యోగ విరమణ చేశారు. ఆయన శనివారం పాడేరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు సమక్షంలో పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సింహాద్రి మాట్లాడుతూ.. అట్టడుగు, అణగారిన వర్గాల అభ్యున్నతితో పాటు అభివృద్ధి, సంక్షేమానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో మేలు జరిగిందన్నారు. భవిష్యత్‌లోనూ వైఎస్సార్‌సీపీ ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందనే నమ్మకంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెడబారికి సురేష్‌కుమార్, కొయ్యూరు మండల పార్టీ నాయకులు వారా నూకరాజు, దేపూరి రాజు, పొట్ల సింహాచలం, సంపరి రమణ, బిత్తరి కళ్యాణం, గుదాలి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


