రావికమతం: నాన్ షెడ్యూల్‌లో గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్‌లో చేర్చాలని గిరిజన యువకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కల్యాణపులోవ నుంచి జెడ్.బెన్నవరం వరకు గిరిజనులు బైక్‌లపై ప్రచారం చేశారు . ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.గోవిందరావు,గలబర్తి రాజు,గెమ్మిల రాజు,పి.బెన్నన్నయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వీరు కల్యాణపులోవ జలాశయంలో జల దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్యాణపులోవ జలశయాన్ని భూ కబ్జదారుల నుంచి రక్షించాలని కోరారు.


