పాయకరావుపేట : ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున ప్రత్యామ్నాయ పంట లను సాగుచేయడం మేలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. పట్టణంలోని వీవర్స్ సొసైటీ భవనంలో శుక్రవారం రైతన్నా మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ నినో ప్రభావం–రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు, పండించవలసిన పంటలపై ముద్రించిన పోస్టర్‌ను కలెక్టర్‌తో కలిసి మంత్రి ఆవిష్కరించి, మాట్లాడారు.
నాట్లు వేసిన కలెక్టర్
కలెక్టర్ విజయ్ కృష్ణన్ అరట్లకోట గ్రామంలో పర్యటించి, వరినాట్లను పరిశీలించారు. పొలంలో దిగి నాట్లు వేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ డీపీ ఎం.లచ్చన్న మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో రైతులు వేయవలసిన పంటలు, తీసుకోవలసిన జాగ్రత్తల పై సూచించారు. ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ అప్పలస్వామి, డాక్టర్ భవానీ, డాక్టర్ రవి కుమార్ తదితరులు రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ డీఏ పీడీ సత్యదేవి, జేడీఏ ఆశాదేవి, ఏవో లు ఉమాప్రసాద్, ఆదినారాయణ, ఏఈవో లు, ఆర్‌ఎస్‌కే సిబ్బంది పాల్గొన్నారు.


