మునగపాక: రాష్ట్రంలోనే పేరుగాంచిన మునగపాక గ్రామీణ యువజన మందిరం 62వ వార్షికోత్సవాల ను ఈనెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మందిర అధ్యక్షుడు ఆడారి శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల తో పాటు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్టు చెప్పారు. 9వ తేదీ నుంచి జిల్లా స్థాయి ఆహ్వాన కబడ్డీ పోటీలు, 11వ తేదీ నుంచి ఉత్తరాంధ్ర ఆహ్వాన వాలీబాల్ పోటీలు జరుగుతాయన్నారు. 14వ తేదీ రాత్రి 7గంటలకు నందీశ్వర కళా తులసీ ప్రాంగణంలో అమ్మ చెక్కిన బొమ్మ, చీకటి బాట నాటక ప్రదర్శనలు, 15వ తేదీన కూచిపూడి నృత్యం, భరతనాట్య ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మందిర ఉపాధ్యక్షులు డాక్టర్ మళ్ల జోగారావు, మళ్ల రామ జగన్నాథం, కోశాధికారి ఆడారి లక్ష్మణరావు, కల్చరల్ కన్వీనర్ ఆడారి రమణబాబు, కార్యదర్శి ఆడారి సూరిబాబు, సహాయ కార్యదర్శి దాడి అరుణ్‌కుమార్, డైరెక్టెర్లు బుద్ద నాగు, పెంటకోట జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు.


