● జిల్లాలో 60.8 ఎంఎంవర్షపాతం నమోదు
సాక్షి, పాడేరు: జిల్లా కేంద్రం పాడేరుతో పాటు పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సుమారు గంటన్నరపాటు కుండపోతగా వర్షం కురవడంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతో పాడేరు వారపు సంతకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. గిరిజనులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివాసీ గర్జన సభకు హాజరయ్యేందుకు వచ్చిన గిరిజనులు సైతం వర్షంతో అవస్థలు పడ్డారు. జిల్లాలో శుక్రవారం 60.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


