డ్రోన్‌తో విత్తన బంతులు! | - | Sakshi
Sakshi News home page

డ్రోన్‌తో విత్తన బంతులు!

Aug 7 2026 1:08 AM | Updated on Aug 7 2026 1:08 AM

నాలుగు వేలు వెదజల్లిన అటవీశాఖ

చింతపల్లి: లోతుగెడ్డ రేంజ్‌ పరిధిలో సామాజిక అడవుల పెంపకానికి డ్రోన్‌ ద్వారా విత్తన బంతులు వెదజల్లే కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. డీఎఫ్‌వో నరసింహారావు ఆదేశాల మేరకు గురువారం చెరుకుంపాకలు, లోతుగెడ్డ బీట్‌ అటవీ ప్రాంతాల్లో వెదురు, కానుగ, చింత తదితర మొక్కల 4 వేల విత్తన బంతులను డ్రోన్‌ ద్వారా వెదజల్లారు. అటవీ ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో అప్పారావు, ఎఫ్‌బీవో లక్ష్మీనారాయణ, ఏబీవో విజయనాగరత్నం, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement