పాడేరు : డీఎస్సీ–2025 ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన స్కాంపై వెంటనే సీబీఐతో దర్యాప్తు చేయించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. డీఎస్సీ లీకేజీ, ఇతర అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కోరారు. వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు గురువారం పాడేరు పాత బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. ఈ దీక్షలు ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. తొలిరోజు దీక్షల్లో ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజుతో పాటు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు పసుపులేటి బాలరాజు, పాడేరు, జి.మాడుగుల మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు నల్ల కండువాలు ధరించి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో మోసపూరితమైన హామీలతో కాలయాపన చేసే ప్రభుత్వం కొనసాగుతోందని విమర్శించారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానిని సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై దేశవ్యాప్తంగా విద్యార్థులు శాంతియుత ఉద్యమాలు చేపట్టిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని గుర్తుచేశారు. అదే విధంగా 2025 డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. అర్హులకు ఉద్యోగాలు దక్కకుండా నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. డీఎస్సీ అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతిని వెంటనే అందించాలని కోరారు. గిరిజన ప్రాంతంలో జీవో నంబర్ 3 పునరుద్ధరణ, 1/70 చట్టం పరిరక్షణ కోసం జరిగే ఉద్యమాల్లో భాగంగా ఈ నెల 7న పాడేరులో నిర్వహించే అరణ్య గర్జన, 8న చేపట్టనున్న రాష్ట్ర మన్యం బంద్‌కు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించి పాల్గొంటుందని తెలిపారు. ఆదివాసీల ప్రయోజనాల కోసం ఎవరైనా చేపట్టే ఉద్యమాలకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పారు. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు పసుపులేటి బాలరాజు మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలపై మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధారాలతో సహా వివరాలను ప్రజల ముందుంచారని తెలిపారు. అయినప్పటికీ బాధ్యులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ పేరుతో 16 వేల ఉద్యోగాల భర్తీలోనే ఇన్ని అక్రమాలకు పాల్పడ్డారని బాలరాజు ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో కొత్తగా గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఏకంగా 1.50లక్షల శాశ్వత ఉద్యోగాలను భర్తీ చేశారని ఆనాడు ఒక్క తప్పటడుగు కూడా వేయకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు దక్కేలా సక్రమంగా నిర్వహించారన్నారు. మెగా డీఎస్సీలో గిరిజన ప్రాంతంలో 80 మందికి మంచి ఉపాధ్యాయ ఉద్యోగాలు రాలేదని కానీ మంత్రి సంధ్యారాణి, జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్‌కుమార్ గిరిజనులకు ఏకంగా 2వేల ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చామని పదేపదే అబద్దాలు చెబుతున్నారన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11 వేల మంది గిరిజన అభ్యర్థులకు శతశాతం ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చాల్సిందేనన్నారు. డీఎస్సీలో అర్హత గల అభ్యర్థులకు న్యాయం జరిగింతే వరకు వైఎస్సార్‌సీపీ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు,జి. మాడుగుల వైఎస్సార్‌సీపీ మండల అద్యక్షులు సీదరి రాంబాబు, నుర్మానీ మత్య్సకొండం నాయుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, జిల్లా కార్యదర్శి వి. సీతారం నాయుడు, వైస్ ఎంపీపీలు కుడుముల సత్యనారాయణ, కుంతూరు కనకాలమ్మ, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్‌కుమార్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి కూతంగి సూరిబాబు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గబ్బాడ శేఖర్, క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాంగి అంద్రయ్య, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పండన్న, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, మహిళ విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు కిల్లో ఊర్వశిరాణి, పాడేరు, జి. మాడుగుల మండలాలకు చెందిన పలువురు ఎంపీటీసీ, తాజా మాజీ సర్పంచ్‌లు, పార్టీలోని అన్ని అనుబంధ విభాగాల నాయకులు, పలువురు నిరుద్యోగులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పాల్గొన్నారు.
సీబీఐతో విచారణ జరిపించాలి
రిలే దీక్షలు విజయవంతం
సాక్షి,పాడేరు: మెగా డీఎస్సీ టీచర్ పోస్టుల భర్తీలో అక్రమాలపై సీబీఐతో విచారణ, మంత్రి లోకేష్ పదవికి రాజీనామా డిమాండ్లతో గురువారం జిల్లాలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన రిలే నిరహార దీక్షలు విజయంతం అయ్యాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రం పాడేరులోను,అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో నియోజకవర్గం కేంద్రం అరకులోయలోను రిలే దీక్షలు చేపట్టారు.
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు డిమాండ్
కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలతో కాలయాపన చేస్తోందని ధ్వజం
పాడేరులో రిలే నిరాహార దీక్షలుప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం తీరుపై నిరసన
అరకులోయ టౌన్: డీఎస్సీ–2025 ఉపాధ్యాయ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు గురువారం అరకులోయలోని వైఎస్సార్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. 2025 డీఎస్సీలో 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారని, స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులకు రాత పరీక్ష లేకుండా అనర్హులను ఎంపిక చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఒక్కో ఉద్యోగానికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసి అనర్హులకు పోస్టులు కట్టబెట్టారని ఆరోపిస్తూ, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. లోకేష్ రాజీనామా చేసే వరకు వైఎస్సార్‌సీపీ ఉద్యమాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.ఉమ్మడి విశాఖ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ 2025 డీఎస్సీలో అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈ అంశాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఉద్యమాన్ని కొనసాగిస్తోందన్నారు. నారాయణ కళాశాల, లోకేష్‌కు చెందిన బంధువుల కళాశాల నుంచి నకిలీ ధ్రువపత్రాలు పొందిన వారికి స్పోర్ట్స్ కోటా సృష్టించి పోస్టులు కట్టబెట్టారన్నారు. చేతకాని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు.భోగాపురం విమానాశ్రయంలో గిన్నిస్ రికార్డు సాధించడంలో కీలకమైన గిరిజన విద్యార్థులు, మహిళలకు ధ్రువపత్రాలు ఇవ్వలేదని ఆరోపించారు. దీనికి మంత్రి సంధ్యారాణి బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా పదవులకు రాజీనామా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, పార్టీ జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిరి రవి ప్రసాద్, రాష్ట్ర విద్యార్ధి విభాగం జనరల్ సెక్రటరీ నాగభూషణ్, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్‌కుమార్, నియోజకవర్గం గ్రీవెన్స్‌సెల్ అధ్యక్షుడు సందడి కొండబాబు, నియోజకవర్గం మహిళ అధ్యక్షురాలు వెంకట పూర్ణిమ, వైస్ ఎంపీపీలు కిల్లో రామన్న, శెట్టి ఆనంద్, అనంతగిరి ఎంపీపీ తెడబారికి మిఽథుల, మాజీ ఎంపీపీ శెట్టి నీలవేణి, ఎంపీటీసీలు దురియా ఆనంద్ కుమార్, జయవర్ధిని, శత్రుఘ్న, స్వాభి రామచందర్, నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల పార్టీ అధ్యక్షుడు స్వాభి రామూర్తి, పాంగి పరశురామ్, కొర్రా సూర్యనారాయణ, పాంగి అనిల్ కుమార్ మజ్జి చంద్రుబాబు, మండల ఉపాద్యాక్షులు పల్టాసింగ్ విజయ్ కుమార్, జి. ప్రకాష్‌రావు, పార్టీ జిల్లా కార్యదర్శి బాక సింహాచలం, జిల్లా జనరల్ సెక్రటరీ పాంగి నర్శింగరావు, మాజీ సర్పంచ్‌లు కిముడు హరి, దురియా భాస్కరరావు, మాజీ జెడ్పీటీసీ దూరు గంగన్న దొర, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రేగ బోయిన స్వామి, పార్టీ బూత్ కమిటీ ఇన్‌చార్జి పాంగి విజయ్, మాజీ ఎంపీటీసీ బూర్జ సుందర్‌రావు, పార్టీ సీనియర్ నాయకులు ఎల్‌బీ కిరణ్ కుమార్, ఎంటీఆర్ సాంబయ్య, నర్సింహమూర్తి, బాలరాజు, పాంగి నాగేశ్వ రరావు, కొండలరావు పాల్గొన్నారు.


