లక్ష్యమే ముఖ్యం..సాధనే ఆయుధం! | - | Sakshi
Sakshi News home page

లక్ష్యమే ముఖ్యం..సాధనే ఆయుధం!

Aug 7 2026 1:08 AM | Updated on Aug 7 2026 1:08 AM

విద్యార్థినులకు ఎస్పీ అమిత్‌ బర్దర్‌విలువైన సూచనలు

చింతపల్లి: కష్టాన్ని ఇష్టంగా మలచుకుని చదివితే ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని ఎస్పీ అమిత్‌ బర్దర్‌ అన్నారు. ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే నిరంతరం సాధన చేయాలని సూచించారు. గురువారం చింతపల్లిలోని అమరావతి వృత్తి విద్య కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఎస్పీ సందర్శించారు. విద్యార్థినులకు కెరీర్‌ గైడెన్స్‌పై అవగాహన కల్పించి, వారితో మాట్లాడారు. భవిష్యత్‌లో ఏం కావాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకుని, ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. డిగ్రీ పూర్తిచేసిన తర్వాత ఉన్న ఉద్యోగ అవకాశాలను వివరించారు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ పోటీ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement