గొలుగొండ: కొత్తజోగుంపేటతోపాటు పలు గ్రామాల్లో గురువారం బురదనీరు సరఫరా కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొత్తజోగుంపేట, శ్రీరాంపురం, గొలుగొండ ప్రాంతాల్లో కుళాయిల ద్వారా బురదతో తాగునీరు సరఫరా అయింది. పైపులు లీకేజు వల్ల ఇలా వచ్చినట్టు ఆయా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రెండు రోజులు నుంచి ఇదే పరిస్థితి ఉందని పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు స్పందించడం లేదని వాపోతున్నారు. బురదనీరు తాగడానికి ఇబ్బందులు పడుతున్నామని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


