డిఫెన్స్‌ మద్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

డిఫెన్స్‌ మద్యం పట్టివేత

Aug 7 2026 1:08 AM | Updated on Aug 7 2026 1:08 AM

డ్రైవర్‌ అరెస్ట్‌..మరొకరు పరారు

రూ.3 లక్షల విలువైన డిఫెన్స్‌ మద్యం, కారు సీజ్‌

వివరాలు వెల్లడించిన ఏఈఎస్‌ ఈశ్వరరావు

నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి జోగినాధునిపాలెం సమీపంలో గురువారం రూ.3లక్షల విలువైన డిఫెన్స్‌ మద్యాన్ని తరలిస్తున్న కారు సీజ్‌ చేశామని జిల్లా అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ బి.ఈశ్వరరావు వెల్లడించారు. మద్యం కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. ముందస్తు సమాచారం మేరకు సీఐ సునీల్‌ కుమార్‌, ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌, సిబ్బంది అప్రమత్తమై మద్యం తరలిస్తున్న కారు పట్టుకున్నారని తెలిపారు. మాకవరపాలెం మండలం, వజ్రగాడ గ్రామానికి చెందిన అప్పలనాయుడు అనే వ్యక్తి డిఫెన్స్‌ మద్యాన్ని కారులోతరలిస్తుండగా ఎకై ్సజ్‌ పోలీసులను గమనించి కారు దిగి పరారయ్యాడు. కారుడ్రైవర్‌ జెర్రిపోతుల గోవిందరావును అదుపులోకి తీసుకున్నారు. కారులో ఎనిమిది రకాల బ్రాండ్లకు సంబంధించిన 44 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అప్పలనాయుడు కోసం గాలిస్తున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. సారా తయారీపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. మున్సిపాలిటీ పరిధి పెదబొడ్డేపల్లిలో ఎనిమిది మందిని బైండోవర్‌ చేసి ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా విధించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement