చింతపల్లి: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయ ని చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థా నం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రిసర్చ్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ డి.ఆదిలక్ష్మి తెలిపారు. ఈ నెల 9వ తేదీ వరకూ అల్లూరి జిల్లా పరిధిలో వాతావరణ వివరాలను వెల్లడించారు. చింతపల్లి, పాడేరు, అరకు డివిజన్ల పరిధిలో వర్షపాతం 7.2 నుంచి 8.9 మిల్లీమీటర్లు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గరిష్ణ ఉష్ణోగ్రతలు 32.5 నుంచి 33.3 డిగ్రీల మధ్య, కనిష్ణ ఉష్ణోగ్రతలు 22.3 నుంచి 23.0 డిగ్రీల మధ్య ఉండవచ్చునన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం వేళల్లో 71 నుంచి 85 శాతం, మధ్యాహ్న సమయాల్లో 80 నుంచి 85 శాతం మధ్యలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గాలి గంటకు 5–6 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు ఉన్నాయన్నారు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందన్నారు. రైతులు పంటలు విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని ఏడీఆర్ సూచించారు.


