పాఠశాలల్లో జేసీ ఆకస్మిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో జేసీ ఆకస్మిక తనిఖీ

Aug 6 2026 12:45 AM | Updated on Aug 6 2026 12:45 AM

జి.మాడుగుల: మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలతో పాటు బందవీధిలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను బుధవారం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాబోధన, విద్యార్థుల చదువు తీరు, ఆరోగ్య పరిస్థితులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడిన జేసీ.. విద్యార్థులు చదువులో వెనుకబడకుండా నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు హాజరవుతున్నారా? లేదా? అనే విషయాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయుల ఫేషియల్‌ అటెండెన్స్‌ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు రగ్గులు, పుస్తకాలను అందించారు. కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement