బంద్‌ విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

బంద్‌ విజయవంతం చేయాలి

Aug 5 2026 12:54 AM | Updated on Aug 5 2026 12:54 AM

పాడేరు రూరల్‌: ఈ నెల 8న నిర్వహించనున్న రాష్ట్ర మన్యం బంద్‌ను విజయవంతం చేయా లని ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం పాడేరు పట్టణంలో కరపత్రాలు పంపిణీ చేస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అనంతరం ప్రజా సంఘాల నాయకులు రాధాకృష్ణ, సుందర్‌రావు, దాసు, చిట్టిబాబు మాట్లాడుతూ.. ఆదివాసీలకు హక్కులు కల్పించే 1/70 చట్టం, 100 శాతం ఉద్యోగ రిజర్వేషన్‌, జీవో నంబర్‌ 3 తదితర అంశాలపై భవిష్యత్‌ ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పోరాటాల ద్వారానే ఆదివాసీల హక్కులు, చట్టాలను పరిరక్షించుకోగలమన్నారు. ప్రతి ఆదివాసీ బిడ్డ ఈ నెల 8న జరిగే మన్యం బంద్‌కు మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు శ్రీనుపాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement