గూడెంకొత్తవీధి: ఏపీ జెన్‌కో విస్తరణ ప్రాజెక్టుకు సంబంధించి పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్ అంశాలపై రెవెన్యూ అధికారులు మంగళవారం గ్రామసభలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఆదేశాల మేరకు బూసుకొండ, శండికోటి, పార్వతినగర్ గ్రామాల్లో ఈ గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు కారణంగా ప్రభావితమయ్యే ప్రాంతా ల్లో పునరావాసం, పునరావాస ప్యాకేజీలకు సంబంధించిన అంశాలపై అధికారులు గ్రామస్తులతో చర్చించారు. గ్రామసభల్లో ఏపీ జెన్‌కో అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


