అచ్యుతాపురం రూరల్: రగ్బీ ఇండియా, ఆంధ్ర ప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ సహకారంతో అనకాపల్లి జిల్లా రగ్బీ అసోషియేషన్ ఆధ్వర్యంలో అస్మిత అండర్–15 బాలికల జిల్లా అంతర్ పాఠశాల రగ్బీ పోటీలు ఈ నెల 10న భోగాపురం క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు రగ్బీ ఇండియా కోచ్ వెంకట్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2011 నుంచి 2014 మధ్య జన్మించిన విద్యార్థినులు ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులని పేర్కొన్నారు. పాల్గొనే ప్రతి క్రీడాకారిణి తప్పనిసరిగా ఎన్‌ఎస్‌ఆర్ ఐడీ నమోదు చేసుకుని ఖేలో ఇండియా పోర్టల్‌లో రిజిష్ట్రేషన్ పూర్తి చేయాలని సూచించారు.


