డీఎస్సీ అక్రమాల నిగ్గుతేల్చాలి | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అక్రమాల నిగ్గుతేల్చాలి

Aug 5 2026 12:54 AM | Updated on Aug 5 2026 12:54 AM

● నారాలోకేష్‌ రాజీనామా చేయాలి ● టౌన్‌హాల్‌ సమావేశంలో వక్తల డిమాండ్‌ ● 6 నుంచి 9 వరకు నిరాహారదీక్షలు ● 10న భారీర్యాలీ

నక్కపల్లి: ఈ ఏడాది కూటమి ప్రభుత్వం భర్తీ చేసిన డీఎస్సీలో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని దీనిపై సీబీఐతో విచారణ చేయించాలని మంగళవారం నక్కపల్లిలో జరిగిన టౌన్‌హాల్‌ సమావేశంలో పలువురు డిమాండ్‌ చేశారు. స్థానిక సుబ్బరామిరెడ్డి కల్యాణ మండపంలో పార్టీ రాష్ట్రకార్యదర్శి వీసం రామకృష్ణ అధ్యక్షతన టౌన్‌హాల్‌(రౌండ్‌ టేబుల్‌) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నాలుగు మండలాలకు చెందిన విద్యార్థి, యువజన విభాగాల ప్రతినిధులు వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు హాజరయ్యారు. ముఖ్యఅతిథులుగా హాజరైన సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, మాజీ ఎమ్మెల్సీ డి.వి. సూర్యనారాయణరాజు, పార్టీ కార్యదర్శి వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు మాట్లాడుతూ డీఎస్సీలో పలు అక్రమాలు జరిగాయన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాలను కూటమి ప్రభుత్వ పెద్దలు అమ్మేసుకున్నారని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఓట్ల కోసం మోసపూరిత వాగ్దానాలు ఇచ్చిందని విమర్శించారు. సూపర్‌సిక్స్‌ పథకాలు అటకెక్కించిందన్నారు. విద్యార్థులకు ఫీజురియింబర్స్‌మెంట్‌ ఇవ్వలేదని, నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3వేలు భృతి ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఒక్కరికి కూడా భృతి ఇవ్వలేదని, ఇలా అన్నివర్గాలను మోసం చేసారని అన్నారు. రెండేళ్లుగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తారని ఆశపడ్డ వారందరిని మోసం చేసారన్నారు. నిరుద్యోగులకు, విద్యార్థులకు అండగా నిలవాలని పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు నిచ్చారన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యామంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలని ఈ సమావేశంలోపాల్గొన్నవారంతా ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయ అభ్యర్థులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు అండగా నిలవాలని అన్నారు. వారి తరపున వైఎస్సార్‌సీపీ చేసే పోరాటాన్ని విజయవంతం చేయాలన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై గత నెల 31న కలెక్టర్‌లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని, 4వ తేదీన టౌన్‌ హాల్‌ సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. ఈనెల6,7,8,9 తేదీల్లో పాయకరావుపేటలో మండలాలవారిగా నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. 10వ తేదీన బాధితులందరితో పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో భారీ ర్యాలీ జరుగుతుందన్నారు. ప్రతి గ్రామం నుంచి నిరాహరదీక్షలకు, నిరసన కార్యక్రమానికి డీఎస్సీలో అన్యాయం జరిగిన అభ్యర్థులు, ఫీజు రియింబర్స్‌మెంట్‌ విడుదల కాక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు, నిరుద్యోగులను తీసుకువచ్చి ఆందోళన విజయవంతం చేయాలన్నారు. ప్రతి కార్యకర్త భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు గొర్ల గోవిందు, మధువర్మ, గెడ్డమూరి శ్రీనివాసరావు, పైలా రమేష్‌, జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు గొర్ల నర్సింహమూర్తి, యువజన విబాగం నియోజకవర్గ అధ్యక్షుడు పోచిన నరేష్‌, విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు యలమంచిలి చందు, పార్టీ రాష్ట్రకార్యదర్శి దత్తుడు సీతబాబు, జెడ్‌పీటీసీలు, గోసల కాసులమ్మ, సిద్దాబత్తుల సత్తిబాబు, లంక సూరిబాబు, వైస్‌ఎంపీపీ వెలగా ఈశ్వరరావు, జిల్లాఅధికార ప్రతినిధి దగ్గుపల్లి సాయి, వాణిజ్య విభాగం అధ్యక్షుడు వై. సత్తిబాబు, యువజన విభాగం మండల అధ్యక్షుడు బచ్చలరాజు, పీఏసీస్‌ మాజీ అధ్యక్షుడు రాజేష్‌ఖన్నా, పొడగట్ల పాపారావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి సుందరలత, రోజారాణి, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement