చింతపల్లి: సబ్ డివిజన్ పరిధిలో ప్రతి ఒక్కరికీ పనికల్పించే విధంగా ఉపాధి హామీ అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ వి.విద్యాసాగర్ అన్నారు. సోమవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో చింతపల్లి,గూడెం కొత్తవీధి,కొయ్యూరు మండలాలకు చెందిన వీబీ జీరాంజీ సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా స్వల్ప కాలంలో ఆదాయం వచ్చే ఉద్యాన పంటల సాగుపై గిరిజనులు దృష్టి సారించే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఉపాధి శ్రామికులకు ఫీల్డ్ అసిస్టెంట్లు ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ పవన్‌కుమార్, అదనపు డీఆర్వో షణ్ముఖరావు, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాల ఏపీవోలు రాం ప్రసాద్,అప్పలరాజు,జూనియర్ ఇంజినీర్లు రమణ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


