దుకాణాల తొలగింపునకు ఆదేశాలు | - | Sakshi
Sakshi News home page

దుకాణాల తొలగింపునకు ఆదేశాలు

Aug 4 2026 1:05 AM | Updated on Aug 4 2026 1:05 AM

రావికమతం: స్థానిక మండల పరిషత్‌ స్థలంలో రూ.కోట్లు విలువ చేసే స్థలంలో అనధికారకంగా ఏర్పాటు చేసిన దుకాణాలను ఆర్‌ఐ రమణబాబు సోమవారం పరిశీలించారు. ఇక్కడ 15 మంది అక్రమంగా షాపులు ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లుతుందని రావికమతం గ్రామానికి చెందిన గెంజి వెంకటరమణ గత సోమ వారం కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఆర్‌ఐ పరిశీలించి మాట్లాడుతూ ఇక్కడ సర్వే నంబరు 103–2లో 15 మంది నిర్మించుకున్న దుకాణాలను తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. వీఆర్వోలు నాగరాజు, శంకర్‌, వీఆర్‌ఏ లోవ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement