కలెక్టరేట్‌లోకి అర్జీదారునికి మాత్రమే అనుమతి ఇవ్వడం వల్ల ఆయనతో వచ్చిన కుటుంబ సభ్యులు బయటే వేచి ఉండాల్సి వస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు తోడుగా వచ్చిన వారికి కూర్చునేందుకు టెంట్లు, కుర్చీలు, తాగునీటి వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో చెట్ల కిందే నేలపై కూర్చొని గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో అందుబాటులో ఉన్న టెంట్లు, కుర్చీలు, మంచినీటి సౌకర్యాలు ప్రస్తుతం లేకపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కనీసం సోమవారం రోజైన టెంట్లు, కుర్చీలు కొనసాగించాలని కోరుతున్నారు.


