గిరిజన ఐఏఎస్‌లకు ఘన సన్మానం | - | Sakshi
Sakshi News home page

గిరిజన ఐఏఎస్‌లకు ఘన సన్మానం

Aug 3 2026 12:49 AM | Updated on Aug 3 2026 12:49 AM

ఐఏఎస్‌లు బాలకృష్ణ,శివకుమార్‌నుసత్కరిస్తున్న అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ

ఐఏఎస్‌లు బాలకృష్ణ, శివకుమార్‌నుఅభినందిస్తున్న మాజీ మంత్రి బాలరాజు

సాక్షి, పాడేరు: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్‌ హోదా ప్రకటించిన గిరిజన గ్రూప్‌–1 అధికారి గుడిసా బాలకృష్ణ, తెలంగాణ క్యాడర్‌లో పనిచేస్తున్న గిరిజన ఐఏఎస్‌ అధికారి కిల్లు శివకుమార్‌నాయుడును ఆదివారం ఆదివాసీ గిరిజన ప్రజా సంఘాలు, గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఘనంగా సన్మానించాయి. మోదకొండమ్మతల్లి ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు పసుపులేటి బాలరాజు ఇద్దరు అధికారులను దుశ్శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం కుమ్మరిపుట్టులోని శంకరన్‌ ఆడిటోరియంలో గిరిజన ప్రజా, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఐఏఎస్‌ల సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అరకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు చెట్టి పాల్గుణ హాజరై గుడిసె బాలకృష్ణ, కిల్లు శివకుమార్‌నాయుడులకు పుష్పగుచ్ఛాలు అందజేసి దుశ్శాలువాలతో సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement