● కేంద్ర ప్రభుత్వ నోడల్ అధికారి సుగుణాకర్
చింతపల్లి: వీబీజీరాంజీ కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులతో ఆదివాసీ గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని కేంద్ర ప్రభుత్వ నోడల్ అధికారి సుగుణాకర్ అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని అన్నవరం, బెన్నవరం, తాజంగి, కిటుములు, లంబసింగి, కొమ్మంగి, బలపం, పెదబరడ, చింతపల్లి పంచాయతీల్లో జాతీయ ఉపాధి పథకం ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సుగుణాకర్ మాట్లాడుతూ.. వీఎంజీ రాంజీ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించాలని మండల అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏఈ రాంప్రసాద్, జేఈ శ్రీను, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.


